
శివతాండవం : రివ్యూ
సినిమా : శివతాండవం
నటులు : విక్రమ్ , జగపతి బాబు, అనుష్క, లక్ష్మీరాయ్ ఆర్మీ, జాక్సన్
డైరెక్టర్ : ఎ.ఎల్ విజయ్
నిర్మాత : సి. కళ్యాణ్
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
విడుదల : అక్టోబర్ .05. 2012
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2 / 5
ప్రముఖ హీరోలు విక్రమ్, జగపతి బాబు కలిసి నటించిన తాజా చిత్రం శివతాండవం. అనుష్క, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. వీరంతా కలిసి ఈ రోజు నుంచి వెండి తెర పై శివతండవాం చేస్తున్నారు. ఈ పోకడ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
చిత్రకథ :
శివతాండవంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేశాడు. స్టోరీ విషయానికొస్తే, క్లుప్తంగా రా ఏజెంట్ విక్రమ్ చుట్టూ తిరిగే కథ ఇది. లండన్ లో బాంబు పేలుళ్ళు జరిగిన సన్నివేశాలతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. తరువాత నగరంలో వరస హత్యలతో జరుగుతుంటాయి. చర్చిలో సంగీతం వాయించే అంధుడైన కెన్ని (విక్రమ్) ను మిస్ ఇంగ్లాండ్ టైటిల్ కోసం పోటీ పడుతున్న సుమ వినాయకం (అమీ జాక్సన్) ప్రేమిస్తుంది. అయితే ఈ వరస హత్యలు చేసేది కెన్ని అని ఆమెకు తెలిసి పోలీసులకు పట్టి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయితే.. కెన్ని ఏ కారణంతో ఈ హత్యలు చేస్తుంటాడు. అసలు కెన్ని ఎవరు..? అతని గతం ఏంటి...? అనేది చిత్రంలో కీలకం. కాగా, మరోకోణంలో ప్రభుత్వం అప్పగించిన టాస్క్ పూర్తి చేసే క్రమంలో కంటిచూపుకోల్పోతాడు విక్రమ్. ఈ క్రమంలో అతనికి సహాయకారిగా జగపతిబాబు నిలిచి లక్ష్యాన్ని విజవంతంగా పూర్తి చేస్తారు. ఇక బ్రిటీష్ బోర్న్ భారతీయ సంతతి అమ్మాయి అమీ జాక్సన్. ఈమె తండ్రి ఒక డాక్టర్. విక్రమ్ చేత చంపబడ్డ ఒక వ్యక్తికి పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తాడు. ఈ కేసును నాజర్ దర్యాప్తు చేస్తుంటాడు. మరో భామ అనుష్క కంటి డాక్టర్. విక్రమ్ కు మంచి ఫ్రెండ్ గా సాయపడుతుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ ఆపరేషన్లో విక్రమ్ ఏ పరిస్థితుల్లో చూపు కొల్పోతాడు.. ఇందులో వారికి ఎదురైన ఒడిదుడుకులు.. వారు ఏవిధంగా వీటన్నిటినీ ఎదురొడ్డి నిలిచారు అనేదే చిత్ర ఇతివ్రుత్తాంతం.
విశ్లేషణ :ఈ మూవీ లో దర్శకత్వ ప్రతిభ అంతంతమాత్రమే. అనేక సందర్భాల్లో ఏమాత్రం లాజిక్ లేకుండా డైరెక్టర్ విజయ్ సన్నివేశాలను తెరకెక్కించాడు. చీమకు కూడా అపకారం తలపెట్టని వాడిగా ఉండే విక్రమ్ మరో కోణంలో దారుణంగా హత్యలు చేయటం విచిత్ర మనిపిస్తుంది. ఫస్టాఫ్ లో సప్పెన్స్, స్క్రీన్ ప్లే కొంతమేర రక్తికట్టించాయి. నైరవ్ షా సినిమాటోగ్రఫీ బావుంది. లండన్ అందాలు బాగా చూపించాడు. ఇక జీవీ ప్రకాష్ మ్యూజిక్ సాదాసీదాగా సాగింది. యాక్షన్ సన్నివేశాల విషయానికొస్తే ఫర్వాలేదనిపించేలా చిత్రీకరించటం కొంత ఊరట నిచ్చే అంశం.
నటీనటుల పనితనం :
ఈ మూవీకి లైఫ్ అండ్ సోల్ మొత్తం విక్రమనే చెప్పాలి. విక్రమ్ ఈ సినిమాకోసం చాలా శ్రమించినట్టు కనిపిస్తుంది. ఇక జగపతి బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అనుష్క చాలా ఫ్రెష్ లుక్ లో అందరినీ ఆకర్షిస్తుంది. అమీ జాక్సన్ నటన ఓకే. మిగతా నటీనటులు సంతానం, నాజర్ తదితరుల నటన వారి వారి పాత్రలకు అనుగుణంగా సాగింది.
ముగింపు :
ఏ మాత్రం అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్లడం తప్పనిసరి లేకుంటే పూర్తి నిరాశే.
...avnk