
రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి హారతి సెంటిమెంట్ భయం పట్టుకుంది. ఈ సెంటిమెంట్ భయంతో ఆమె చాలా భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె భయానికి కారణం ఉందని కొంతమంది ప్రజలు అంటున్నారు. సబితా ఇంద్రా రెడ్డి మూడో కుమారుడు కళ్యాణ్ రెడ్డి చేసిన పూజల్లో అపశ్రుతి దొర్లింది. హారతి పళ్లెంలో ఆయన కానుకగా వేసిన నోట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఆయన శ్రీకాళహస్తి గుడిలో తన స్నేహితులతో కలిసి రాహు – కేతు సర్పదోష నివారణ పూజలు చేసిన సమయంలో పూజరి హారతి పళ్లెంను అతన దగ్గరకు తీసుకురావటం జరిగింది. అయితే వెంటనే అతను హారతి కళ్ళకు అద్దుకుని ఆ ప్లేట్ లో కరెన్సీ నోట్లను కానుకగా వేయటంతో వెంటనే అందరు చూస్తుండగానే ఆ నోట్లు హారతి జ్వాలకు అంటుకుని కాలిపోవటంతో .. అక్కుడున్న భక్తులు, పూజరి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఇలా జరగడం క్రీడుకు సంకేతకం అని పూజరి చెప్పినట్లు తెలుస్తోంది. అతని మిత్రులు కూడా చాలా ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ది చెందిన వాయులింగక్షేత్రంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదని భక్తులు, పూజారులు అంటున్నారు. తొలిసారి ఇలా జరిగిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఇలా జరగటం పై హోం మంత్రి కి కొత్త భయంతో వణికిపోతున్నారని సమాచారం. అదీ పాపపు సొమ్ము కాబట్టి దేవుడు ముందు కాలిపోయిందని కొంత మంది భక్తులు అనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్న విషయం హోం మంత్రి గుర్తుకు వచ్చి భయంతో ఉందని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.