25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Botsa.gif

    Oct 30 ,2012 07:09 pm

    Botsa meets KCR

    మా పెళ్లికి మీ ఊరు రండి’ ఇదే సినిమా టైటిల్ కాదండి ? ఇద్దరి పొలిటికల్ నాయకుల మద్య జరిగిన సంభాషణ. ఆ ఇద్దరు పార్టీ వేరు అయిన వారు కలిసి ఇలా మాట్లాడుకున్నారు. వారిలో ఒకరు  పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ  మరొకరు  టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరావు.  అసలు విషయం ఏమిటంటే .. నవంబర్ 2న బొత్స సత్యనారాయణ కూతురి వివాహానికి కేసిఆర్ ను పిలిచే సందర్భంలో ఇద్దరి మద్య వచ్చిన స్వీటైన మాటలు .  మా పెళ్లికి రండి? మీ ఊరు చూసినట్లు ఉంటుందని బొత్స కేసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అంటే  కేసిఆర్ పూర్వీకుల  ఊరు కూడా  విజయనగరం కావటంతో  బొత్స చెప్పిన మాటలకు కేసిఆర్ ముఖంలో కొత్త ఆనందం కనబడినట్లు తెలుస్తోంది.  కేసిఆర్ కూడా తప్పకుండా ‘మా ఊరు వస్తానని’ బొత్సకు మాట ఇవ్వటం జరిగిందని  టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ సందర్భంగా బొత్సతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. ఇంటికి వచ్చిన బొత్సను కేసీఆర్.. కారు దగ్గర వరకు వెళ్లి మర్యాదపూర్వకంగా సాగనంపినట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.  అయితే బొత్స కూతురు వివాహానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పెళ్ళికి వెళితే ఎలా ఉంటుంది.. వెళ్ళకుంటే ఎలా ఉంటుందని ఆయన పార్టీ వర్గాలను కోరినట్లు తెలిసింది. ఉద్యమాల్లోని భేదాభిప్రాయాలను మానవ సంబంధాలకు ముడిపెట్టవద్దని, హాజరయితేనే బాగుంటుందని కొంతమంది సూచించినట్లు సమాచారం.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers