20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • CM.gif

    Oct 30 ,2012 05:39 pm

    muthyam reddy vs Farooq Hussain

    మెదక్ జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ బాటలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కన ఇద్దరు ఐటమ్ నాయకులు చేరి ఇందిరమ్మ బాట రచ్చ రచ్చ చేసినట్లు తెలుస్తోంది.  సీఎం సాక్షిగా ఆ ఇద్దరు నాయకుల నాలుకల మీద బూతు పదాలు నాట్యం చేసినట్లు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.  వారు ఎవరు కాదు .. ఆ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఒకరు  ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ.  మెదక్ జిల్లా దుబ్బాకలో  జరుగుతున్న ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన వెంటనే ఈ ఇద్దరు మద్య తీవ్రమైన వ్యాఖ్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి  ఎమ్మెల్సీ  షారుఖా హుస్సేన్ పై తీవ్రవైన  వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.  ‘ వాడు ఇక్కడేంది మాట్లాడేది.. సిద్దిపేట గురించి  ఇక్కడ మాట్లాడుతాడా’..?   వాడు జేబులు కొట్టేటోడు అంటూ విమర్శలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.  ఈ మాటలు విన్న షారూఖ్ హూస్సెన్   తీవ్రంగా స్పందించారు.  ‘నీవేంది ..నేను దుబ్బాక నియోజకవర్గంలో  కాంగ్రెస్  పార్టీని 30 ఏళ్లుగా కాపాడుకుంటు వస్తున్నా.. ఇక్కడి  పార్టీ  కార్యకర్తలు, ప్రజలతో  నాకున్న బంధం నీకెక్కడిది అని ప్రశ్నించారు.  ఈఇద్దరి మద్య పోటా పోటీ మాట యుద్దం జరిగినట్లు తెలుస్తోంది.  నీమాదిరి నేను టీడీపీలో నుంచి దుంకి రాలేదు. నువ్వే పార్టీ ఫణిరాయించేటోడివి  అంటూ ముత్యం రెడ్డిపై తీవ్రస్థాయిలో  మండిపడ్డారు.  ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం  ముదిరి ఏకవచనం  వరకు వెళ్లడంతో  రంగంలోకి పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సముదాయించారు. ఈ ఇద్దరు సీఎం కిరణ్ అటు ఒకరు ఇటు ఒకరు ఉండి ఐటమ్ గాళ్ల మాదిరి  తిట్టుకోవటం చూసిన కాంగ్రెస్ నాయకులకే నవ్వొచ్చిందని మీడియా వారు అంటున్నారు.  ఇందిరమ్మ బాటు సీఎం కిరణ్ పరువు తీసిన నాయకులుగా ప్రజలు చెప్పుకుంటున్నారు.  

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers