
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియ గాంధీకి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గారి భార్య కాంగ్రెస్ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ అంటే చాలా ఇష్టం అనే మాట ఢిల్లీ నాయకుల్లో వినబడుతుంది. ఎంపీ బొత్స ఝాన్సీ కి తన భర్త అయిన బొత్స సత్యనారాయణ వలనే మంత్రి పదవి రాలేదనే వార్తలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. బొత్స ఝాన్సీ విజయ నగరం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే సోనియా గాంధీతో ఎంపీ ఝాన్సీకి మంచి సంబందాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంద్ర జిల్లాల్లో అత్యదిక జనాబా కలిగిన తూర్పు కాపు వర్గానికి చెందిన ఝాన్సీ అంటే సోనియా గాంధీకి ప్రత్యేకమైన అభిమానం ఉందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. అయితే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషాంలో ఆమె పదవికి బొత్స సత్యనారాయణ పదవి అడ్డుపడినట్లు తెలుస్తోంది. గతంలో బొత్స సత్యనారాయణకు పీసీసీ పదవి రావటానికి కారణం బొత్స ఝాన్సీ నే అనే మాటలు ఢిల్లీ నాయకులు మద్య వినిపిస్తున్నాయి. ఇప్పటికే బొత్స రెండు పదవుల గురించి కాంగ్రెస్ నాయకులు మధ్య అనేక సార్లు చర్చ జరిగిన విషయం తెలిసిందే. బొత్స ఒకపక్క రాష్ట్ర మంత్రిగా ఉంటూ, మరోపక్క అత్యంత కీలకమైన పీసీసీ అధ్యక్ష పదవులో ఉన్న కారణం చేత ఝాన్సీ కి మంత్రి పదవి ఇవ్వలేకపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒకే కుటుంబ నుండి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదదన్న ఉద్దేశంతో అధిష్టానం ఝాన్సీని మంత్రి వర్గంలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఝాన్సీ రావాల్సిన మంత్రి శ్రీకాకుళం నుంచి తొలిసారిగా ఎంపీ అయిన కిల్లి క్రుపారాణి సామాజికంగా వెనకబడిన కాళింగ వర్గానికి చెందిన ఈమెను మంత్రి వర్గంలోకి తీసుకోవటం జరిగినట్లు ఢిల్లీ నాయకులు చెబుతున్నారు.