25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • jagananna.gif

    Oct 29 ,2012 04:49 pm

    jagananna rajyam profits in ap state

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న పాదయాత్ర  11 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ పదకొండు రోజులు పాదయాత్రలో షర్మిల ప్రజలకు రాజన్న రాజ్యం, జగనన్న రాజ్యం వస్తుందని, జగనన్న  రాజ్యం కోసం మనమందరం కష్టపడాలి అని ప్రశంగాలు ఇస్తున్న విషయం తెలిసిందే. షర్మిలా చేసే ప్రకటనలపై తెలుగు దేశం పార్టీ  కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు జగనన్న రాజ్యం అంటే ఏమిటి?  జగనన్న రాజ్యం  వల్ల ఎవరికి లాభం? జగనన్నరాజ్యం ఏం తెస్తుంది?  అనే ప్రశ్నలకు షర్మిల సమధానం చెప్పాలని  తెలుగు దేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారట.   నేను జగనన్న వదిలిన బాణాన్ని అని  చెప్పుకుంటు పాదయాత్ర చేస్తున్న షర్మిలగారు  ఆ మిగిలిపోయిన బాణం ఏమిటి ? అని తెలుగు నాయకులు అడుగుతున్నారట.  జగనన్న రాజ్యం అంటే.. ? లక్ష కోట్లు మా అన్నయ్య సంపాదించాడు. ఆయన టార్గెట్  రెండు లక్ష కోట్లు.  అందుకే నేను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల చెబుతుందని  టీడీపీ నాయకులు అంటున్నారు.  అంటే జగనన్నటార్గెట్ ను పూర్తి చెయటానికి షర్మిల పాదయాత్ర చేస్తుందని  తెలుగుదేశం పార్టీ  మహిళ నాయకులు అంటున్నారు.  రాష్ట్రంలో  జగన్ ఆస్తులు పెంచుకొని ప్రయత్నం షర్మిలా చేస్తున్నారని వారు అంటున్నారు.  జగనన్న రాజ్యం వస్తే ..  జగన్ కోసం  మరో లక్ష అడుగుల ఇల్లు,  రెండు సిమెంట్ కంపెనీలు,  అనీల్ కు ఎరువుల కంపెనీ, మరో  టీవీ మీడియా, మరో పత్రిక,  బెంగుళూరులో  75 ఎకరాలలో ఇల్లు,  ( గతంలో ఉన్న ఆస్తుల కంటే ) రెట్టింపు ఆస్తులు సంపాదించటానికి మంచి అవకాశం వస్తుందట. అదీ కేవలం జగనన్న రాజ్యం వలనే జరుగుతుందని  షర్మిల ఆలోచనని టీడీపీ నాయకులు అంటున్నారు.  జగనన్న రాజ్యం లో  రెట్టింపు ఆస్తులు సంపాదించటం కోసమే ఆమె పాదయాత్ర చేస్తుందని  టీడీపీ వారు అంటున్నారు.  అందుకే షర్మిల నేను జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రజలకు చెప్పుకుంటుందని  తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. 

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers