
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాపులను గుర్తించి , కాంగ్రెస్ ను కాపుల రాజ్యంగా మార్చుతుందనే విషయం అందరికి అర్థం అవుతుంది. ఇప్పుటి వరకు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం వారు అదిపత్యం చేస్తు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి సారిగా కాపు వర్గానికి పెద్ద పీట వేసింది. కాంగ్రెస్ కాపులను గుర్తించటానికి కారణం మెగా స్టార్ చిరంజీవే అనే మాటలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం కాపులున్నారని కాంగ్రెస్ పార్టీకి తెలియాజేసింది కూడా చిరంజీవిగారు. అప్పటివరకు రాష్ట్రంలో రెడ్డి వర్గం వారు ఎక్కువగా ఉన్నరని అని నమ్మిన అధిష్టానాకి చిరంజీవి కళ్లు తెరిపించాడు. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఉపకులాలును కలిపిన ఘనత చిరంజీవి గారిదే. చిరంజీవి గారు రాజకీయం ప్రవేశం చేసిన తరువాత కాపు కులానికి మంచి గుర్తింపు వచ్చింది. చిరంజీవిగా ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో ఉన్న కాపులను గుర్తించే విధంగా చేశారు.

రాష్ట్రంలో ఉన్న కాపుల గురించి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ తిన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలను మనసులో పెట్టుకొని కెబినెట్ లో కాపులకు స్థానం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి వర్గం వారు జగన్ పార్టీలోకి వలసలు వెళ్లటంతో కాంగ్రెస్ పార్టీ కాపులవైపుకు మళ్లీంది. చిరంజీవి గారు ప్రజరాజ్యం పార్టీ పెట్టి కాపు వర్గానికి రాష్ట్రంలో పెద్ద మార్క్ వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం క్యాబినెట్ లో పర్యటక శాఖ మంత్రిగా కె. చిరంజీవి గారికి ఇవ్వటం జరిగింది. అలాగే ఎంఎం పల్లంరాజు కు మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా నియమించటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాపులకు, బిసిలకు, వెనకబడిన వర్గాలను గుర్తించటంపై రాష్ట్రం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.