
మెగా స్టార్ కుటుంబానికి 2012 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరంలో మెగా ఫ్యామిలీకి గొప్ప విజయం చేకూరింది. మెగా స్టార్ కుటుంబానికి కలిసొచ్చిన మెగా ఇయర్ గా చెప్పుకోవచ్చు. సినీ రంగంలో మెగా హీరోల సినిమాలు ఈ సంవత్సరం రికార్డులు తెచ్చాయి. రామ్ చరణ్ , తమన్నా జంటగా నటించిన సినిమా ‘రచ్చ’ , అల్లు అర్జున్ , ఇలియానా జంటగా నటించిన సినిమా ‘జులాయి’, అలాగే పవన్ కళ్యాణ్, శ్రుతి హసన్ జంటగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్ ’ రీసెంట్ విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలు ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేయించిన విషయం తెలిసిందే. అయితే ఇక రాజకీయ రంగంలోకి వస్తే చిరంజీవి తన కేరీర్ లోనే బెస్ట్ ర్యాంక్ ని సంపాదించుకోవటం జరిగింది. కేంద్ర మంత్రిగా చిరంజీవి పదవిస్వీకరణ చెయటం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం మెగా వారికి మెగా విజయాలను అందించిన ఇయర్ గా మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. గత సంవత్సరం కంటే 2012 సంవత్సరం మెగా వారికి బాగా కలిసి వస్తుందని జ్యోతిష్యులు ముందు చెప్పినట్లు తెలుస్తోంది.