
ప్రేమ పగ రూపంలో శాన్విని బలి తీసుకుంది. ఇప్పుడు అమెరికా నుండి ఇండియా వరకు సంచలనం స్రుష్టించిన శాన్వి అనే చిన్నారి హత్య వెనుక పెద్ద ప్రేమ కథ దాగి ఉన్నట్లు తెలుస్తోంది. శాన్వి తల్లి చారులత పై కాలేజీ రోజుల నుండి మనసు పారేసుకున్న రఘు ఆమె కోసం అమెరికా వెళ్లినట్లు మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. ఆమెపై మోజు చావని రఘు, ఆమె ను వెంబడిస్తూ ఆమె కదలికల్ని గమనిస్తూ చారులత కోసం అనేక ప్రయాత్నలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై చారులత మాట్లాడితే తప్ప అసలు నిజం బయటికి వస్తుందని అమెరికా మీడియా వారు అంటున్నారు.

రఘు చారులత కోసం వారు ఉంటున్న ప్రాంతంలోనే మకాం పెట్టి, అదును కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రఘు చారులత కుటుంబం పై నిఘా పెట్టిన ఆమె కుమార్తెపైనా, చారులత అత్తగారిపైనా పగ తీర్చుకోవాలని రఘు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందుకు అదును చూసుకోని చారులత అత్తను హత్య చేసిన శాన్వి కిడ్నాప్ చేసినట్లు రఘు పోలీస్ లతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అతనెవరో తమకు తెలియదని చారులత కుటుంబీకులు చెబుతున్నారు. దీనిపై చారులత మాట్లాడితే అసలు నిజం బయటకు వస్తుందని పోలీసులు అంటున్నారు.