20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 16.gif

    Oct 25 ,2012 02:46 pm

    gowtham_margబ్రహ్మానందం ఆనందానికి అవధులు లేకుండాపోయాయట. ఎందుకంటే తన కొడుకు పెళ్లివేడుకలో అతిరథమహారధులంతా వేంచేసి పెళ్లివేడుకను ఆహ్లాదభరితం చేసినందుకట. గత మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతున్న హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట తొలిపండగ జరిగిన వేళ బ్రహ్మీకి ఈ అనుభూతి కలిగిందని స్వయానే బ్రహ్మీనే వెల్లడించారు. వాళ్ల పెద్దబ్బాయి గౌతమ్ వివాహం బుధవారం రాత్రి హైదరాబాదు, మాదాపూర్ లోని N కన్వెన్షన్ సెంటర్లో జ్యోత్స్న(సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస రెడ్డి తనయ) తో వైభవంగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమ తరలి వచ్చింది. హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు.... ఒకరేమిటి... పరిశ్రమ మొత్తం ఈ వేడుకకు విచ్చేసింది.

    gow2
         అలాగే, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు కూడా విచ్చేసి, నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి 7 గంటల నుండి రిసెప్షన్ కార్యక్రమం మొదలవగా, 10 గంటల 58 నిమిషాలకి వివాహ ముహూర్తం జరిగింది. చిరంజీవి, మోహన్ బాబు, జయప్రద వంటి తారలు వివాహ సమయానికి హాజరయ్యారు.

    gow4
             ఇదిలా ఉండగా, 'బాణం' చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చైతన్య దంతులూరి, తన తదుపరి చిత్రాన్ని బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'బసంతి' అనే పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ డిజైన్ ను గౌతమ్ పెళ్లిరోజే విడుదల చేశారు. మంచి కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 'పల్లకిలో పెళ్ళికూతురు', 'వారేవా' వంటి రెండు సినిమాలు చేసినప్పటికీ, గౌతమ్ కి ఇంతవరకు హిట్ రాలేదు. చైతన్య టాలెంట్ వున్న దర్శకుడు కాబట్టి, ఈసారి గౌతమ్ కి సక్సెస్ వస్తుందని ఆశిద్దాం... ఆల్ ద బెస్ట్ గౌతమ్...

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers