24 May Friday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
  • 17.png

    Oct 21 ,2012 04:57 pm

    original_allu-arjun-sneha-redd

           హీరో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి హైదరాబాదులోని వారి ఫాం హౌజ్ లో  జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడింది. వెంటనే ఆమెను సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆమెకు తగిలినవి స్వల్ప గాయాలేననీ, ఆందోళన చెందాల్సిన పని లేదనీ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్ కూడా అదే కారులో వున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద వార్త తెలియడంతో, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలి వెళ్ళారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న చిరంజీవి తన సతీమణి సురేఖ, కొడుకు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసనతో సహా వెళ్ళి ఆమెను పరామర్శించారు.
         కాగా,  మనకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిలు వీకెండ్‌ గడపడానికి తమ ఫామ్‌ హౌస్‌కి వెళ్ళారట. అక్కడ స్నేహాకు అల్లు అర్జున్‌ గోకార్టింగ్‌ నేర్పడం మొదలు పెట్టాడని సమాచారం. పిల్లలు ఆడుకునే చిన్నసైజు కారులా ఈ వాహనం ఉంటుంది. ఇది నేర్చుకుంటున్న సమయంలో కారు అదుపుతప్పి ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. దాంతో స్నేహా ఎడమచేయి విరిగింది. ఆమెను వెంటనే యశోదా హాస్పటల్‌కి తీసుకువెళ్ళి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం అపోలో హాస్పటల్లో చేర్చారు.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers