
హాట్ బ్యూటీ నయనతార ఇప్పుడు తన దృష్టంతా మంచి పాత్రల మీద కాకుండా, మంచి పారితోషికం మీద పెడుతోంది. తన డిమాండును నగదు రూపంలోకి మార్చేసుకోవాలని పరితపిస్తోంది. అందుకే, పారితోషికం విషయంలో కరాఖండీగా ఉంటోందని పేరు తెచ్చుకుంది. తను చెప్పిన రేటు ఇవ్వడానికి రెడీగా వున్న నిర్మాతలనే ఆమె ఎంటర్ టైన్ చేస్తోందట. లేకపోతే కనీసం కథ కూడా వినడం లేదని కోలీవుడ్ వర్గాల కథనం. ఇటీవల తాను చేసిన 'కృష్ణం వందే జగద్గురుం', ప్రస్తుతం చేస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలకు 1 కోటీ 25 లక్షల చొప్పున తీసుకుందనీ, అంతకు ఏమాత్రం తగ్గినా తన డేట్స్ లేవని మొహం మీదే చెప్పేస్తోందనీ అంటున్నారు. ఈ విషయంలో ఎటువంటి మొహమాటాలు లేవని మరీ అంటోందట.
...avnk