రాజమౌళి 'ఈగ', హిందీ వెర్షన్ 'మక్కీ' ఉత్తరాదిన మాత్రం డీలా పడిపోయింది. ఈ నెల 12 న విడుదలైన హిందీ వెర్షన్ కి ప్రేక్షకాదరణ లభించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ సూపర్ హిట్టవడంతో, అక్కడ కూడా పెద్ద హిట్టవుతుందని అంచనా వేసిన సినీ పండితుల లెక్కలు తారుమారయ్యాయి. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ, ఈ 'మక్కీ'కి ఎందుకు ప్రేక్షకాదరణ లభించలేదన్న విషయం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే, డబ్బింగు చిత్రం కావడం అన్నదే దీనికి ప్రధాన కారణం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే, చాలా మంది ఏదో ఒక రూపంలో తెలుగు వెర్షన్ చూసేశారట. దానికి తోడు, ఉత్తరాది ప్రేక్షకులకి 'ఈగ' కథాంశం నచ్చలేదని అంటున్నారు.
...avnk
