
నిన్నటి వరకు అతను ఒక దర్శకుడు. సినిమా తీస్తేనే అతని పేరు వెండి తెరపై పడుతుంది. తీసిన సినిమా మంచి విజయం సాధిస్తేనే ఆ దర్శకుడు పేరు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఈ దర్శకుడు మాత్రం టాలీవుడ్ మంచి హిట్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అతని దర్శకత్వంలో వచ్చే సినిమా కోసం సినీ జనాలు ఎదురు చేసే స్థాయికి ఎదికిపోయాడు. అతనే పూరి జగన్నాథ్. దర్శకుడు పూరి అభిమానులు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే రీసెంట్ తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా తెలంగాణ వాదులకు పూరిని శత్రువుని చేసింది. ఆ సినిమాలోని సన్నివేశాలు వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది. ఆ పాత్రల చిత్రీకరణ కేసిఆర్ ను కించపరిచారంటూ టీఆర్ఎస్ పార్టీ జగన్ నిప్పులు కురిపించింది. ఒకనొక సమయంలో జగన్ ని సమైక్యవాది అంటు తెలంగాణ వాదులు ఇంటి పై , ఆఫీస్ పై దాడి చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వాదులు రెచ్చిపోయి జగన్ ను బట్టలిప్పించి రోడ్డుకీడుస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జగన్ తీసిన ఇలా బాంబులు పేల్చుతుందని ఊహిచంలేదని ఆయన అంటున్నారు. తెలంగాణ వాదులు ఒత్తిడి మేరకు జగన్ తెలంగాణ కు జై అని చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. చివరకు కేసిఆర్ తో దర్శకుడు శంకర్, నటుడు నారాయణ మూర్తి , చర్చలు జరిపి .. జగన్ చేత క్షమాణ చెప్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ కూడా తెలంగాణ వాదులకు భయపడి తన సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తానని చెప్పటం జరిగిందట. అంతేకాకుండా ఎవరినైన కించపరిచి ఉంటే క్షమించండి అని జగన్ చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. సినిమాలో 12 షాట్లు కట్ చేసినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు నిర్మాత దిల్ రాజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు జగన్ తెలంగాణకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోందని మీడియా వర్గాలు అనుకుంటున్నాయి.
