
టాలీవుడ్ లో ఐటమ్ పాటలకు మంచి గిరాకీ పెరిగిపోతుంది. ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తే.. 20 నుండి 30 లక్షలు వస్తాయి. అందుకే హీరోయిన్లు ఐటమ్ సాంగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఐటమ్ పాప ల మధ్య పోటీ పెరిగి పోయింది. కష్టం తక్కువ క్యాష్ ఎక్కువ అనే ఫిలింగ్ హీరోయన్లు బాగా తెలిసిపోవటంతో చిన్న హీరోయిన్లు ఐటమ్ పాపలుగా మారిపోతున్నారు. ఒక పాటలో అన్ని అందాలు ఆరబోస్తే లక్షలు వస్తాయి అనే సూత్రం పై హీరోయిన్లు నడుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఒకరు రావాల్సిన ఛాన్స్ ను మరొకరు తన్నుకుపోతున్నారు. ‘డమరుకం’ సినిమాలోని ‘ఛాయ్... సక్కుబాయ్’ పాట ఇప్పుడు మాస్ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపుతోంది. టీవీల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ తో ఛార్మి మరోసారి దుమ్ము దులిపేస్తోంది.

అయితే, ఈ ఛాయ్ గీతానికి మొదట శ్రియని అనుకున్నారట. ఎందుకంటే శ్రియ ఇంతకుముందు ‘పులి’లో ‘దోచెయ్ దొరికిందీ దోచెయ్’ అంటూ ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. అందాల ఆరబోతతో అందర్నీ ఆకర్షించింది. అయితే, డమరుకంలోని ‘సక్కుబాయ్’ గీతం జానపద ఛాయలు ఉండటంతో శ్రియని కాదనుకున్నారట. ఎందుకంటే, శ్రియ సన్నగా ఉంటుంది, కేవలం క్లాస్ ప్రేక్షకులని మాత్రమే ఆమె ఆకర్షిస్తుందని భావించారట. అందుకే బొద్దుగుమ్మ ఛార్మి అయితే బాగుంటుందని చివరికి ఆమెకి అవకాశం ఇచ్చారని సమాచారం.
