
వెండితెర పై ఒక మెరుపు మెరిసి కనుమరుగైన సెక్సీ పాప జాహ్నవి. మళ్లీ వెండి తెరపై వస్తుంది. ఆమె తన అందాలతో ను నటనతోను తెలుగు అభిమానులను సంపాదించుకుంది. టివి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భారీ అందాల భామ జాహ్నవి. టివి కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత సినిమా రంగంలోకి కూడా ప్రవేశించింది. యజ్ఝం, రణం, ఒకరికి ఒకరు, అశోక్ వంటి చిత్రాల్లో నటించింది. కాగా, చాలా కాలం తరువాత జాహ్నవి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న దేనికైనా రెడీ సినిమాలో జాహ్నవి నటిస్తుంది.

ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. అలాగే, గత కొంత కాలంగా అజ్ఝాతంలో ఉన్న జాహ్నవి ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రసూల్ తో కొన్నాళ్ళపాటు సహజీవనం సాగించిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కాగా, ప్రస్తుతం దేనికైనారెడీ సినిమాలో నటిస్తున్న జాహ్నవి గతంలో కంటే బాగా సన్నబడిందని చిత్ర యూనిట్ అంటోంది.