
ఐదేళ్లుగా ఎదురు చూసిన అందరి ఎదురు చూపుకు ఇక పుల్ స్టాఫ్ పడింది. ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నా వారికి ఇక లైసెన్స్ వచ్చింది? సైఫ్ కరీనాల ప్రేమ విషయం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరికి తెలిసిందే. చివరి వరకు వీరి ప్రేమ పై అనేక కామెంట్లు కాలంతో పాటు పరుగులు తీసాయి. ఈ ఇద్దరిలో ఉన్న కామవాంచ తీరగానే విడిపోతారని చాలా మంది సినీవారు పభ్లిక్ గానే మాట్లాకోన్న విషయం తెలిసిందే. అలాంటి వారిక మాటలకు సైఫ్ , కరీనాలు కళ్ళెం వేశారు. 2007 నుండి వీరి ప్రేమ ప్రయాణం సాగింది. వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగినట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. సంగీత్ వంటి వేడుకలు ఎంతో వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల బంధువులు, స్నేహితులు, ఈ వేడుకకు హాజయ్యారని సమాచారం. అయితే ఈరోజు జరిగే వేడుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొందరిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. కరీనా సైఫ్ ల పెళ్లికి మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రత్యేకంగా ఆహ్వనించినట్లు తెలుస్తోంది, కానీ కరీనా , సైఫ్ ల పెళ్లి కి రాష్ట్రపతి వెళ్లలేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సైఫ్ పెళ్లి లో ముఖ్యంగా ఆయన మాజీ భార్య, కూతురు, కొడుకు రావటం అందరికి ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు. సైఫ్, కరీనాలకు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం. కొడుకు కూతురు ముందే రెండో పెళ్లి చేసుకోవటం ఒక బాలీవుడ్ హీరోకే దగ్గిందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
