
సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ పై బాగా మోజు పెరిగిపోయింది. మొన్న హీరో నితిన్, నిన్న హీరో శ్రీకాంత్, నేడు అల్లరి నరేష్. మెగా ఫ్యామిలీ సభ్యుల చేతుల మీద ఫంక్షన్ జరిగితే.. ఆఫంక్షన్ భారీ ఎత్తున్ విజయం సాధిస్తుందని టాలీవుడ్ హీరోల నమ్మకం? ఆ నమ్మకం నిజమైన సందర్భాలు చాలా ఉన్నాయాని టాలీవుడ్ ప్రజలు చెబుతున్నారు. అల్లరి నరేష్ మెగా స్టార్ చిరంజీవి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ , రమ్యక్రిష్ణ తో నటించిన సినిమా ‘‘యముడికి మొగుడు’’ ని మెగా స్టార్ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి చేతులు మీదగా ఆడియో రిలీజ్ చేస్తే మంచిదని ఆ సినిమా దర్శకుడు ఇ . సత్తిబాబు, అల్లరి నరేష్ కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మరో సెంటిమెంట్ కూడా ఉందని వారు చెబుతున్నారు.

గతంలో ఈ సినిమా పేరుతో చిరంజీవి నటించి అద్బుతమైన విజయం సాధించిన విషయం అందరి తెలిసిందే. అది మనసులో పెట్టుకొని వారు ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అదీ కూడా చిరంజీవి గారి పుట్టిన రోజు నాడే ఈ సినిమా లోగోని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి చేతుల మీదగా ఈ సినిమా పాటల్ని విడుదల చేస్తే అటు మెగా అభిమానుల ఆనందంగా ఉంటుందని దర్శకుడి ఆలోచనట. అయితే ఇంక చిరంజీవి నుండి ఎలాంటి సమాధానం రాలేదని టాలీవుడ్ ప్రజలు అంటున్నారు.
