
టాలీవుడ్ కి గాడ్ ఫాదర్ ఎవరు అంటే వెంటనే చెపుతారు దర్శకుడు, నటుడు, నిర్మాత గా సినిమా కు సేవాలందించిన సీనియర్ డాక్టర్ దాసరి నారాయణ రావు పేరు చెబుతారు. అయితే ఇప్పుడు ఆయన బాటలో ఒక నవయువ దర్శకుడు ఫాలో అవుతున్నాడని టాలీవుడ్ టాక్? అతను ఎవరో కాదు దర్శకుడు పూరి జగన్నాథ్ ( జగన్) . ఈ జగన్ ప్రముఖ దర్శకుడైన దాసరి బాటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జగన్ పై అనేక విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. దాసరి ఎప్పు డు రెండు మాటలు చెబుతారు. ఆయన జీవితం ఎంత కష్టపడి పైకి వచ్చాన విషయం చెబుతారు. రెండో పాయింట్ .. తనకు ఇష్టం లేని వాళ్లు ఎంత మంచి పని చేసిన వారిపై విమర్శులు చేయటం ఆయన అలవాటు. ఇప్పుడు అదే బాటలో జగన్ వెళ్లుతున్నాట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో దాసరి సినిమా వారిపై ఒక కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పెద్ద దర్శకలు, నిర్మాతలు చిన్న సినిమాలు తీస్తే బాగుంటుంది.
చిన్న సినిమాలు విజయాలు సాధిస్తాయి అని దాసరి చెప్పటం జరిగింది. జగన్ కూడా దాసరి అదే మాట చెప్పినట్లు తెలుస్తోంది. పెద్ద వారితో పెద్ద సినిమాలు చేయ్. అప్పుడప్పుడూ చిన్నవారితోనూ సినిమాలు తీయ్ అని జగన్ తో దాసరి చెప్పటం జరిగిందట. ఎందుకంటే నీకు పెద్ద సినిమాలు కరువైనప్పుడు చిన్న సినిమాకు నువ్వు కొత్తకాకూడదు అన్నారు. ఉపయోగపడే మాట అని జగన్ అంటున్నారు. కాకపోతే అందుకు నిర్మాతలు సిద్దంగా లేరని జగన్ చెబుతున్నారు. కానీ నిర్మాతలు దర్శకుడి వ్యక్తిగత నిర్ణయం పట్టించుకోరాని జగన్ చెబుతున్నారు. ‘నీ డబ్బుతో నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో’ అని నిర్మాతలు దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయాని జగన్ అంటున్నారు. ఏమైన జగన్ దాసరినే ఆదర్శంగా తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్.
