25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • TNSF.gif

    Oct 16 ,2012 05:03 pm

    Sharmila to face tough time

    ఇటీవల ‘అవినీతి  వ్యతిరేక   భారతం’(ఐఎసి)  నాయకుడు అరవింద్ కేజ్రివాల్  సోనియా గాంధీ అల్లుడు గిల్లుడు వ్యవహారం బయట పెట్టిన విషయం తెలిసిందే. దేశం మొత్తం సోనియా అల్లుడు రాబర్డ్ వాద్రా గురించి మాట్లాడుకోటం విశేషం.  వాద్రా చేసిన అవినీతి బయటపడటంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అయితే సోనియా అండాతోనే  రాబర్డ్ వాద్రా అవినీతి భారీ ఎత్తున పాల్పడినట్లు  కేజ్రీవాల్  ఆరోపించారు.  సోనియా గాంధీ కూడా  అల్లుడు పై వచ్చిన విమర్శలకు వెంటనే  ఖండిచడం    అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడ ఆంద్రప్రదేశ్ లో  మరో రాబర్డ్ వాద్రా పుట్టాడనే పుకార్లు వస్తున్నాయి.  ఢిల్లీ అత్త (సోనియా) అండతో  దేశాన్ని కొల్లగొడితే.. ఆంద్రప్రదేశ్ లో  మామ ( వైఎస్) అండతో అల్లుడు గిల్లుడు వ్యవహారం బయటపడుతుంది. 

    Sharmila to face tough time

    వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్  అంతర్జాతీయ  అవినీతి పరుడుగా ఎదిగారని  టీఎన్ఎస్ఎఫ్  అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయుగౌడ్ విమర్శించారు.   ఆయన నేరుగా బ్రదర్ అనిల్ భార్య అయిన షర్మిలాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.   వాద్రా మాదిరిగానే  బ్రదర్ అనిల్ కూడా  లక్ష ఎకరాల్లో బైరటీస్  గనులు కొల్లగోట్టేందుకు  ప్రయాత్నలు చేసినట్లు  ఆయన అంటున్నారు.  అంతేకాకుండా బ్రదర్ అనిల్  హత్యలకు పునుకున్నట్లు వారు చెబుతున్నారు.  ఆధ్యాత్మిక రంగంలో ఆధిపత్యం కోసం మత భోదకుడు   కెఎ పాల్ పై హత్య కు పథకం  రచన చేసినట్లు వారు చెబుతున్నారు.   అవినీతి,  నేర చరిత్ర  కలిగిన  కుటుంబ ప్రతినిధైనా షర్మిలా  పాదయాత్ర  చేస్తానంటే  విద్యార్థి లోకం,  యువతరం అసహ్యించుకుంటున్నారన్నారు. తండ్రి అధికారాన్ని  అడ్డం పెట్టుకుని  జగన్ లక్ష కోట్లు  దోచుకున్నారన్నారు.  జగన్ ధనదాహానికి ఎంతో మంది ఐఏఎస్  అధికారులు,  మంత్రి,  పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారన్నారు.  ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురానికి  బదులు చంచల్ గూడ నుంచి తీహార్ జైలు వరకు వైఎస్ కుటుంబ సభ్యులంతా  కలిసి పాదయాత్ర చేయాలని  ఆంజనేయ గౌడ్ సూచించారు.  బ్రదర్ అనిల్  ఆంద్రప్రదేశ్ వాద్రా వారు సూచించారు.  అక్కడు అత్త ? ఇక్కడ మామ ? దేశాన్ని , రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారాని వారు మండిపడుతున్నారు. 

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers