19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • pawan.gif

    Oct 12 ,2012 08:03 pm

    Cameraman Gangatho Rambabu

    ప్రపంచ వ్యాప్తంగా  విడుదలకు సిద్దమైన టాలీవుడ్  సినిమా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా నటించిన  చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. టాలీవుట్  టూ బాలీవుడ్ వరకు  అందరు టాలీవుడ్ రాంబాబు గురించే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా సెంచరీ కొట్టిన ‘గబ్బర్ సింగ్’ విజయానందలో ఉన్న ప్రేక్షకులు ముందుకు రాంబాబు వస్తున్నాడని తెలిసి ప్రేక్షకులకు, ప్రముఖ నటులకు, పవన్ అభిమానులకు కొత్త ఆసక్తి సంతరించుకుంది.   అయితే రాంబాబు గురించి బాలీవుడ్  హీరోలు, కోలీవుడ్ హీరోలు, కన్నడ హీరోలు , రాంబాబు  గురించి  వాకబు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కథ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్  కథ చెప్పటం కంటే  ముందు రాంబాబు సినిమా స్పెషల్  గా మీకు చూపిస్తాను. మీకు నచ్చితే అప్పుడు తీసుకోండి? ముందు మీకే రాంబాబు రైట్స్ ఇస్తానని  పవన్ చెప్పినట్లు బాలీవుడ్ టాక్. సల్మాన్ ఖాన్ కూడా రాంబాబు మాటలు ఫిధా అయినట్లు తెలుస్తోంది.  అలాగే తమిళ హీరో  సూర్య కూడా రాంబాబు కథ గురించి  పవన్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

    అదేవిధంగా  కన్నడ హీరో ఆర్యా  కూడా రాంబాబు సినిమా గురించి తెలుసుకోవాలని   ఫిలింనగర్ చేరుకున్నట్లు టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి.  అమీర్ ఖాన్ కూడా అల్లు అరవింద్ ను కలిసి  రాంబాబు కథతో బాలీవుడ్ రీమేక్ చేద్దామని అడిగినట్లు తెలుస్తోంది. నిన్నఅమితాబ్ పుట్టిన రోజు  వేడుకకు  మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ ల దంపతులు వెళ్లిన విషయం తెలిసిందే .  ఆ సందర్భంలో  అమితాబ్ చిరుతో  రాంబాబు కథ గురించి  అడగడంతో.. చిరంజీవి రాంబాబు కథ గురించి పవన్ కళ్యాన్ నాకే  చెప్పలేదు ..మరీ మీకు నేను ఎం చెప్పగలన్ బిగ్ బి అని చెప్పినట్లు తెలుస్తోంది.  అమితాబ్  రాంబాబు కథ బాగుంటే  తన కొడుకు అభిషేక్ బచ్చన్ రీమేక్ చేసే ఆలోచన ఉన్నట్లు కనబడుతుంది.  ఒక వేళ రాంబాబు  సినిమాను రీమేక్ చేసే ఉద్దేశం మెగా వారికి ఉంటే  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తీసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్ రెడీ బాలీవుడ్ లోకి రామ్ చరణ్ అడుగుపెట్టడం జరిగిన విషయం తెలిసిందే.  ప్రపంచం మొత్తం దసరా పండుగ కోసం ఎదురు చూడటం లేదు కానీ... ఆ రోజు వచ్చే పవర్ లాంటి రాంబాబు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు గంగ సాక్షిగా తెలుస్తోంది.  టాలీవుడ్  పవర్ కోసం  కొన్ని కోట్ల మంది ఎదురు చూడటం చరిత్రలో ఇదే మొదటి సారిగా  చెప్పవచ్చు?  అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సీక్రెట్?

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers