
ఇలాంటి పని నా జీవితంలో నేను చెయ్యలేదు. ఇలాంటి మాటలు నా జీవితంలో నేను వినలేదు? ఇలాంటి మనిషి నా జీవింతలో చూడలేదు? అనే మాటలు మనకు నిజ జీవితంలో వినిపిస్తుంటాయి. అలాగే మా జీవితంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులాంటి మేము చూడలేదని ఒక ప్రభుత్వ అధికారి అయిన సీబీఐ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్ చెప్పటంతో.. అందరికి పెద్ద షాక్ వార్త విన్నట్లు ఉందని ప్రజలు అంటున్నారు. సీబీఐ వారికే ఇంత విసుపు పుట్టించే కేసులా ఉందేమోనని ప్రజలు అనుకుంటున్నారు. అమర్ ప్రతాప్ సింగ్ రెండు రోజుల పాటు సాగిన సీబీఐ ఏసీబీ అధిపతుల సమావేశంలో జగన్ కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసు గురించి ఇంక విదేశాలను నుంచి సమాచారం రావాలని ఆయన అన్నారు. ఆ సమాచారమే కేసుకు అత్యంత ప్రధానమైనదని అమర్ ప్రతాప్ సింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేసు గురించి విభిన్న కోణాల్లో దర్యాప్తు జరుగుతుందిన చెప్పారు. ఇలాంటి కకేసు మా జీవితంలో చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. మేము త్వరగా పూర్తి చేయ్యటానికే ప్రయత్నిస్తున్నామని అయితే అదీ ఎంత త్వరగా అన్నది మేము చెప్పలేమని అమర్ ప్రతాప్ సింగ్ చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
