
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు ఇటీవల తీసిన సినిమా వలన పెద్దగా విజయం రాలేదు. అయితే ఇటీవల తీసిన శిరిడి సాయి సినిమా కూడా ఆయనకు నిరాశ మిగిల్చిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అయితే నాగార్జున డమరకం సినిమా మంచి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి నాగార్జునకు పెద్ద గండం వచ్చింది. అదీ కూడా మెగా ఫ్యామిలీ నుండి రావటంతో నాగార్జునకు కొంచెం భయం పట్టుకుందని సినీ ప్రజలు అనుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా నాగార్జున డమరుకం కు పోటీగా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్దమైంది. అయితే రాంబాబు అమ్ముడుపోయినట్లు డమరుకం సినిమా అమ్ముడు పోవటం లేదట. బయ్యర్లు భయంతో డమరుకం సినిమాను కొనటంలేదనే టాక్ వినిపిస్తుంది. రాంబాబు ముందు నాగార్జున సినిమా పోటీలో గెలవలేదని భావించి డమరుకం సినిమా కొనటం బయ్యర్లు ఆపినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ సినిమా కోసం వెళ్లిన వారు కూడా రాంబాబు గురించి మాట్లాడుకోవటంతో నాగార్జునకు టెన్షన్ మొదలైందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. అసలే హిట్ లేక అల్లాడుతున్న నాగార్జునకు రాంబాబు తో పెద్ద టెన్షన్ పట్టుకుందని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది. డమరుకం బిజినెస్ మొత్తం ఆగిపోవటంతో .. నాగ్ పుల్ టెన్షన్ లో ఉన్నాడని టాలీవుడ్ వాసులు అనుకుంటున్నారు.
