
ఠాగూరు , గజిని లాంటి సినిమాలను తెలుగు తెర పరిచయం చేసిన దర్శకుడు ఏఆర్ . మురుగదాస్. కొంచెం అనుభవంతో తమిళంలో అజిత్‌తో ఓ సినిమా తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. తరవాత సినిమా రమణ (తమిళం). సూపర్‌హిట్. దాన్ని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా ఠాగూర్ (సినిమా)గా రీమేక్ చేశారు. అది తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. తరువాత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఆధారంగా సూర్య నాయకుడిగా గజినీ సినిమా తీశాడు. అది కూడా తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్ లో అదే సినిమాని ఆమిర్ ఖాన్ తో తీసే అవకాశం వచ్చింది. ఆ చిత్రం కూడా సంచలన విజయాన్ని సాధించింది. సినీ నటులను, మీరు యాక్టర్ కాకపాతే ఏం అయ్యేవారు అంటే.. వెంటనే .. డాక్టర్ అయ్యేవాళ్లమని ఠక్కున చెబుతారు. ఎ.ఆర్ మురుగదాస్ కూడా చదువుకొనేటప్పుడు దర్శకుడు కావాలని అనుకోలేదట. ఆయన సినిమా ఇంటస్ట్రీకి రాకముందు ఆయన మనసులో పెద్ద కోరిక ఉండేదట. ప్రజా సేవా కోసం ఏదైన కొత్తగా చెయ్యాలనే ఉద్దేశం ఉండేదని దర్శకుడు మురుగదాస్ చెబుతున్నాడు. ఆయన ఒక నక్సలైట్ గా మారాలని చదువుకునే రోజుల్లో బలంగా అనుకున్నాడని ఆయన చెబుతున్నాడు. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల రోజల్లో ఆత్మన్యూనత ఎక్కువగా ఉండేది. కళాశాలలో చదివేటప్పుడు బిడియం ఎలా పోయిందో కూడా తెలియదు. తప్పులను ప్రశ్నించే థైర్యం పుట్టింది. అయితే ఆ తప్పులను ఎదుర్కొంటూ ఎలా పోరాడాలో తెలియని పరిస్థితి నక్సలైట్ అవుదామా? రాజకీయ నేత అవుతామా? అనే ఆలోచన ఉండేది. ఒక చిన్నారి ఫొటో ఆ యుద్దాన్ని ఆపిందట. యుద్దాన్ని ఆపే బలం ఆ ఫొటోకు వచ్చిందనే కారణంతో చిత్ర సీమ వైపు అడుగులు వేశానని మురుగదాస్ తన గుండేళ్లో దాగిన నిజాన్ని బయట పెట్టారు.
