
తాజా జఫ్ఫా... బ్రహ్మానందం తనయుడు గౌతమ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. 'పల్లకిలో పెళ్ళికూతురు' ... 'వారేవా' వంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన గౌతమ్, నటుడిగా తనని తాను నిరూపించుకునే పాత్రల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఛాయాగ్రాహకుడు శ్రీనివాసరెడ్డి కూతురుతో గౌతమ్ వివాహం ఖాయమైంది. ఈ నెల 24 న వీరి వివాహం హైదరాబాద్ - HICC లో అంగరంగ వైభవంగా జరగనుంది. బ్రహ్మానందం అందరికీ కావలసినవాడు ... అందరూ కావాలనుకునే వాడు కావడంవల్ల, ఆ రోజున సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండే అవకాశముంది. గౌతమ్ పెళ్లి సందర్భంగా బంధుమిత్రులను ఆహ్వానించడంలో బ్రహ్మానందం తీరిక లేకుండా ఉన్నాడు. అత్యంత సన్నిహితుల ఇళ్లకి ఆయన స్వయంగా వెళ్లి మరీ ఆహ్వానం
పలుకుతున్నాడు. ఇక మరో వైపున శ్రీనివాస రెడ్డి కూడా తన సన్ని హితులను ... బంధుమిత్రులను ఆహ్వానించే పనిలో బిజీగా వున్నారు. ఇప్పటికే బ్రహ్మీ ఇంట్లో పెళ్లికల సంతరించుకుంది.
...avnk