
ప్రముఖ సినీ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల అరెస్టయ్యారు. ఆమెను హైదరాబాద్ చార్మినార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రముఖ చారిత్రాత్మకమైన చార్మినార్ వద్ద పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘బొగ్గు తవ్వకాలు ఆపండి, అడవులను రక్షించండి.’ అనే బ్యానర్ ను అమల, ‘గ్రీన్ పీస్’ సంస్థ సభ్యులు కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చార్మినార్ వద్ద, అదీ అనుమతి లేకుండా బ్యానర్ కట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అమలను, అరెస్ట్ చేసిన ఇతరులను తరువాత వారి వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు తరువాత విడుదల చేశారు. అయితే, ఈ కేసులో అమల కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. కోర్టు సమన్లు అందుకున్న అనంతరం దీని మీద అమల సంజాయిషీ ఇచ్చు కోవాల్సిఉంది.
.,...avnk