టాలీవుడ్ సంచలన మూవీ 'మగధీర' చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమెక్ చేస్తున్నారు. ఇందులో 'రాంచరణ్ తేజ' పాత్రను 'హృతిక్‌రోషన్' పోషిస్తున్నారు. ఈమూవీ టాలీవుడ్‌లో నిర్మించడానికి రెండు సంవత్సరాలు పని చేశానని, హిందీలో చేయడానికి రెండు సంవత్సరాలైనా ఓపికగా తీస్తానని 'రాజమౌళి' పేర్కొనట్లు తెలిసింది. హిందీలో తీస్తే ఏ హీరోను సూట్ అవుతారని అడిగితే ఏ హీరోయైనా సూట్ అవుతారని, కాని 'హృతిక్‌రోషన్' బెస్ట్ ఛాయిస్ అని 'రాజమౌళి' పేర్కొన్నట్లు బాలీవుడ్ మీడియో భోగట్టా. మొత్తానికి టాలీవుడ్ దర్శక ప్రతిభ బాలీవుడ్‌కు పాకడం అభినందనీయమే. హిందీలో ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు నిర్మించాలనే ఆతృతలో 'రాజమౌళి' ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి తెలుగులో నిర్మించిన 'ఈగ' చిత్రం హిందీలో 'మక్కీ'గా వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 12వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రాజమౌళితో కలిసి పనిచేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. గతంలో ఇక్కడ సక్సెస్ ను సాధించిన రాజమౌళి చిత్రాలు, ఈ మధ్య బాలీవుడ్ లో భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే ఉంది. ముఖ్యంగా కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందుండే అమీర్ ఖాన్, రాజమౌళి సినిమాలో చేయడానికి మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. కథ ఏదైనా తాను వినకుండానే ఒప్పుకుంటానని చెబుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందిస్తోన్న సినిమాను హిందీలో తనతో రీమేక్ చేస్తానన్నా తాను సిద్ధంగానే ఉన్నానని అంటున్నాడు. మరి రాజమౌళి మనోగతమేమిటో..
...avnk