
తెలుగులో టాప్ పొజిషన్‌లో ఉండికూడా ఆ వైభవాన్ని అంతా వదులుకొని తమిళనాడుకు వెళ్ళిపోయింది అనుష్క. తమిళంలో నెంబర్1 అవ్వాలన్న కోరికతో ప్రయత్నించింది. సింగం చిత్రం ఆమెకు నెంబర్ వన్ హిట్‌గా నిలిచి అనుష్క హవా తమిళనాట స్థిరపడింది. ఆ చిత్రం తర్వాత ఆమెకు మరో హిట్ లభించకపోవడం ఇక్కడ పెద్ద చుక్కెదురైనట్లయంది. ఒక్క హిట్ లేకపోయినా ఆమె అనుష్క పేరుతోనే మార్కెట్‌లో నిలబడింది. త్వరలో విడుదల కానున్న ‘తాండవం’ చిత్రంపై పూర్తి నమ్మకంతో ఉంది. తమిళంలో ఈ చిత్రం ఆశించినంతగా లేకపోవడంతో డీలా పడింది. తెలుగులోనైనా అనుష్క, జగపతిబాబుల పేరుతోనైనా ఈ చిత్రం విజయంవైపు పయనిస్తుందేమో చూడాలి. తమిళంలో కావాలనుకున్నది తెలుగులో ఎప్పుడో దొరికింది. దాన్ని వదిలేసి అనవసరమైన పాకులాటతో అనుష్క రెండిటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయింది. ఇప్పటికైనా తెలుగులో పూర్తిస్థాయి నటిగా ఉంటే అవకాశాలకు ఆమెకు కొదవలేదని టాలీవుడ్‌లో సినీపండితుల అంటున్నారు.