26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • KCR.gif

    Sep 28 ,2012 06:11 pm

    Why is KCR silent on Telangana?

    తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మాటల మంత్రలను ప్రజలపై ప్రయోగించి తనకు నచ్చిన విధంగా మలుచుకోవటంలో సిద్దహస్తుడు కేసిఆర్. అయితే ప్రత్యేక తెలంగాణ ఆయన పార్టీ పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు పోరాటం చేస్తునే ఉన్నాడు. కానీ తెలంగాణ మాత్రం రాలేదు. రీసెంట్ గా కేసిఆర్ ఢిల్లీ లో మకాం పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీలో ఎందుకు ఉంటున్నాడో, అక్కడ ఏంచేస్తున్నాడో ఎవరికి తెలియాదు. ఇక్కడ మాత్రం తెలంగాణ కోసం మిలిగిన పార్టీలు, విద్యార్థులు, తెలంగాణ నాయకులు, యుద్దం చెయ్యటానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కూడా ఆయన ఢిల్లీలోనే ఉండటం పై అనేక అనుమానాలు వస్తున్నాయాని తెలంగాణ నాయకులు అంటున్నారు. కొంతమంది నాయకులు అయితే కేసిఆర్ ను అక్కడే కాపురం పెట్టామని సలహా ఇవ్వటం కూడా జరిగింది. కానీ కేసిఆర్ ఎవరు మీద కామెంట్ గానీ, ఎలాంటి ప్రకటన గానీ చేయటంలేదు. ఆయన అంత మౌనం పాటిస్తున్నాడు. కేసిఆర్ అసలు మౌనం గా ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ అర్థం కావటంలేదని తెలంగాణ నాయకులు అంటున్నారు.

    కేసిఆర్ మౌనం వెనక ఏదైన కుట్ర దాగి ఉందా? అసలు కేసిఆర్ కు ఏమైంది? అనే అనుమానాలు తెలంగాణ ప్రజలకు కలుగుతున్నాయాని మీడియా వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏ ఆందోళన చేసినా ముందువరుసలో ఉండే కేసీఆర్ మౌనాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నారంటూ మావోయిస్టు పార్టీ జగన్ అడుగుతున్నారు. తెలంగాణ మార్చ్ నేపధ్యంలో మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖను విడుదల చేసింది. తెలంగాణ కోసం ఢిల్లీలో చర్చలకు వెళ్లిన కేసీఆర్ అక్కడ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే ఏమిటి అన్న వాయలార్ రవితో చర్చల మర్మమేమిటో విడమరిచి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, తెలుగుదేశం, తెరాసలు మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేసిఆర్ కు మౌనం అనే సూత్రం ప్రధాని మంత్రిని చూసి నేర్చుకున్నాడేమోనని తెలంగాణ నాయకులు అనుకుంటున్నారు. కేసిఆర్ నోరు విప్పితేగానీ ..అసలు విషయం బయటకు వస్తుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers