26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Rabbani.gif

    Sep 28 ,2012 05:26 pm

    Hina Rabbani Khar attempt suicide

    అందానికే అందం.. ఆమె అభినాయానికే కుందనపు బొమ్మహీనా రబ్బానీ. ఆమె విదేశాంగ మంత్రి . ఇద్దరి పిల్లలకు తల్లి. అయిన ఆమెలోని సుకుమార తనం దగ్గలేదు. కానీ రీసెంట్ గా ఆమె పై లవ్ ఎఫైర్స్ నడుపుతుందనే పుకార్లు ప్రపంచం అంతా షికార్లు చేసిన విషయం తెలిసిందే.  అయితే తన భర్తకు కూడా ఆమె మీద అనుమానం రావటంతో సహజంగా జరిగింది.  ఈ అవనమానం తట్టుకోలేని ఆమె సూసైడ్ పాల్పడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, కుందనపు బొమ్మ హీనా రబ్బానీ ఖర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. తనకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టోకు మధ్య ప్రేమ ఉన్నట్టు తన భర్త ఫిరోజ్ గుల్జర్ సందేహించి గుచ్చిగుచ్చి ఫోనులో అడగటంతో మనస్తాపానికి గురైన హీనా.. ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు బంగ్లాదేశ్ టాబ్లాయిడ్ ఓ కథనాన్ని ప్రచురించింది.మీడియాలో వరుసగా వస్తున్న కథనాలపై ఆరా తీసిన ఫిరోజ్ గుల్జర్.. ఈ ప్రేమకు సంబంధించిన సమాచారాన్ని, వెబ్‌సైట్ లింకులను సేకరించి ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న హీనాకు పంపించినట్టు ఆ పత్రిక పేర్కొంది. అంతటితో వదిలిపెట్టిని గుల్జర్ తన భార్యపై సందేహించి పదేపదే గుచ్చిగుచ్చి ఫోనులో వివరణ అడగటంతో మనస్తాపం చెందిన హీనా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు టాబ్లాయిడ్ తెలిపింది.

    Hina Rabbani Khar attempt suicide

    ఇదిలావుండగా, తన భార్య విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు బిలావల్ భుట్టో కోసం ప్రత్యేకంగా సావనీర్లు తీసుకరావడంపై కూడా ఫిరోజ్ ఇపుడు ఆరా తీస్తూ.. వారిద్దరి మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పత్రిక పేర్కొంది. అంతేకాకుండా, పీపీపీ అధ్యక్ష హోదాలో ఉన్న బిలావల్‌తో హీనా సుదీర్ఘంగా ఇంటర్నెట్ చాటింగ్‌లో ఉండేదని, దీనిపై ప్రశ్నించగా, దౌత్య సంబంధమైన అంశాలపై చాటింగ్ చేస్తున్నట్టు భర్తకు హీనా సమాధానం చెపుతూ సర్దిపుచ్చుతూ వచ్చేదని ఆ పత్రిక తెలిపింది.దీన్ని నమ్మని ఫిరోజ్.. భార్యతో తరచూ గొడవపడేవాడని టాబ్లాయిడ్ పేర్కొంది. అంతేకాకుండా ఇదేవిధంగా చేస్తే తాను వదిలి వెళ్లిపోతానని హీనా బెదిరించినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోలేదని తెలిపింది.అదేసమయంలో తన ఆఫీసులో పని చేసే ఉద్యోగినితో రాసలీలలు జరుపుతూ హీనాకు భర్త గుల్జర్ పట్టుబడ్డారని, అప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగినట్టు సమాచారం. అంతేకాకుండా, భర్త తనకు ద్రోహం చేయడంతో షాక్‌కు గురైన హీనా.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్టు టాబ్లాయిడ్ పేర్కొంది. అంతేకాకుండా, బిలావల్‌కు శృంగార గ్రీటింగ్ కార్డులను పంపిన హీనా.. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి కంటపడి ఆయన నుంచి చీవాట్లు తిన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.ఈ విషయం బిలావల్‌కు తెలియడంతో తండ్రి జర్దారీపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. పీపీపీ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోతానని, ఆ తర్వాత హీనా కూడా విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేస్తుందని, పిమ్మట తామిద్దరం పెళ్లి చేసుకుంటామని తండ్రికి తెగేసి చెప్పినట్టు ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించి సంచలనం రేపింది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers