19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Pranab.gif

    Aug 09 ,2012 04:22 pm

    Sachin Tendulkar, Rekha take lessons on Parliament functioning from Pranab Mukherjee

    కొత్త రాష్ట్రపతి .. కొత్తగా  సభలో అడుగు పెట్టిన  మాస్టర్  బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ , బాలీవుడ్ నటి  రేఖలు కొత్త లోకంలోకి అడుగుపెట్టారు. అయితే  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, నటి రేఖలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎదుట కాసేపు విద్యార్థులుగా మారిపోయినట్లు తెలుస్తోంది. రేఖ, సచిన్‌లను ప్రణబ్ ముఖర్జీ పిలుపించుకొని వారిద్దరికి కాసేపు పార్లమెంటు వ్యవహారాల పైనా, రాజ్యాంగంలోని అంశాల పైనా, భారత స్వతంత్ర చరిత్ర పైనా అవహాగన కల్పించినట్లు తెలుస్తోంది.  రాజ్యసభలో రేఖ, సచిన్ టెండుల్కర్‌లే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చెక్ షర్ట్ ధరించిన సచిన్ సతీమణి అంజలితో కలిసి పార్లమెంటుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సభలోకి అడుగు పెట్టగానే మిగతా ఎంపీలంతా ఆయన వైపు ఆసక్తిగా తిరిగి చూడటం జరిగిందట. బంగారు రంగు జరీ, గులాబి రంగు అంచుల క్రీమ్ కలర్ చీరలో రేఖ మెరిసి అందరినీ ఆకట్టుకుందని ఢిల్లీ మీడియా వారు అంటున్నారు. వీరిద్దరికీ మిగతా సభ్యులు శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. అను ఆగా, జావెద్ అక్తర్‌ల మధ్యనున్న 99వ నెంబరు సీటులో రేఖ, టికె రంగరాజన్ పక్కన ఉన్న 103వ నెంబరు సీటులో సచిన్ కూర్చున్నారు. సభ ముగిశాక వారిద్దరి ఫోటోలు తీసేందుక మీడియా కొత్త హడవుడి చేసినట్లు తెలుస్తోంది . దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడిందని  కొంత మంది ఎంపీలు అంటున్నారు. అయితే ఇది సచిన్  ఓ కొత్త అనుభవమని  మీడియా వర్గాలు అన్నట్లు తెలుస్తోంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers