20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Narasimha.gif

    Jul 06 ,2012 04:09 pm

    'Narasimha Rao connived at demolition of Babri Masjid'

    బాబ్రీ మసీదు కూల్చి సమయంలో   పీవీ పూజ గదిలో  పూజులు చెయ్యటం ప్రారంబించాడనే వార్తలు  జోరుగా వస్తున్నాయి . అసలు ఆ సమయంలో  పీవీ పూజ గదిలో ఉన్న విషయం ఇప్పటివరకు దేశ ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా తెరపై రావటం చాలా బాదకరమైన విషయమని కొందరు అంటున్నారు.  అపర చాణక్యుడు, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై బురదజల్లుడు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.  దివాలా అంచుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన విషయాలను మాటమాత్రంగా కూడా ప్రస్తావించని ఉత్తరాది మేధావులు.. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయన నిష్క్రియగా ఊరుకున్నారని ఒకరి తర్వాత మరొకరు గంట పదంగా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిన్న కాక మొన్న అర్జున్ సింగ్ పుస్తకంలో ఆయన మీద విమర్శలు గుప్పించగా.. ఇప్పుడు ప్రముఖ పాత్రికేయుడు కుల్‌దీప్ నయ్యర్ కూడా ఆత్మకథ 'బియాండ్ ద లైన్స్'లో పీవీపై బురదజల్లాటం మొదలు పెట్టారు.  బాబ్రీ మసీదు కూల్చివేతకు పీవీ మౌనంగా అంగీకారం తెలిపారని నయ్యర్ అంటున్నారు.

    కరసేవకులు మసీదును కూల్చడం మొదలుపెట్టగానే ఆయన పూజలో కూర్చోవటం జరిగిందట. చిట్టచివరి రాయిని కూడా తొలగించిన తర్వాతే ఆయన పూజ గదిలో పైకి లేచినట్లు నయ్యర్  చెబుతున్నారు.  పూజ జరుగుతుండగా రావు అనుచరుడొకరు వచ్చి ఆయన చెవిలో మసీదు కూల్చివేత అయిపోయిందని చెప్పినట్లు మధు లిమాయే (దివంగత సోషలిస్టు నాయకుడు) నయ్యర్ కు చెప్పటం జరిగిందని ఆయన అంటున్నారు. కొన్ని సెకండ్లకే పూజ అయిపోయింది అని నయ్యర్ తన పుస్తకంలో రాసుకున్నారని తెలిసింది. అప్పటికే కాంగ్రెస్ శ్రేణులు మండిపోతున్నాయి గానీ, అందుకు కారణం మసీదు కూల్చివేత కాదని, అంతర్గత తగాదాలేనని నయ్యర్ చెప్పుకొచ్చారు. పీవీ ఇటు పార్టీ పగ్గాలు, అటు ప్రధాని పదవిని చేపట్టడం సోనియాగాంధీకి ఎప్పుడూ ఇష్టం లేదన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే ఆ సమయంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. కానీ.. క్రమంగా వివిధ రాష్ట్రాల నేతలు, జాతీయ నేతలు ఆమె వద్దకు వచ్చి పార్టీకి నాయకత్వం వహించాల్సిందిగా కోరారని, పార్టీలో కేవలం ఆమె పట్ల మాత్రమే ఏకాభిప్రాయం ఉన్నట్లు కనిపించిందన్నారు. మతతత్వ శక్తులు రాజకీయాలను ఆక్రమిస్తున్నాయని ఆమె ఆవేదన చెందారని రాశారు. "నేను ఆమెతో ఒక్కసారే మాట్లాడాను. అప్పుడు ఆమె లౌకికవాదానికి కట్టుబడినట్లు కనిపించారు. భారతీయ సమాజానికి బహుళవాదమే కచ్చితంగా సరిపోతుందని ఆమె బలంగా నమ్మారు'' అన్నారు. మతతత్వంపై పోరాడాలంటే రాజకీయాల్లో చేరక తప్పదని, అందుకు ఆమె చేతిలో ఉన్న ఏకైక ఆయుధం కాంగ్రెస్సేనని తాను ఆనాడే అంచనా వేసినట్లు నయ్యర్ రాశారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers