18 Jun Tuesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 12.gif

    Jul 23 ,2012 03:32 pm

          julayi_teaserfఅల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జులాయి’. ఇలియానా కథానాయిక. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. అయితే.. మహామహులైన బన్నీ-త్రివిక్రమ్-దేవిశ్రీ సినిమా కరెంట్ అప్డేట్ ఏమిటంటే వీరు ప్రయోగాత్మకంగా రూపొందించి నిన్న హైదరాబాద్లో విడుదల చేసిన జులాయి ప్రచార గీతం ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్‌లపై చిత్రీకరించిన ‘పకడో పకడో..అనే ప్రచార గీతాన్ని మెగా అభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు.
            ‘హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా ప్రమోషనల్ గీతాలుంటాయి. అక్కడి నుంచి అవి హిందీకి వచ్చాయి. ఎప్పుడూ ప్రతి విషయంలోనూ ముందుండే త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే తరహా గీతాన్ని తెలుగులో ఇప్పుడు ‘జులాయి’ కోసం చేశాడని అల్లు అరవింద్ ప్రస్పుటించారు.  ఈ ప్రమోషనల్ గీతంలో దేవీ, బన్నీ కలిసి వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయని అరవింద్ తెలిపారు.
            ‘ప్రచార గీతాన్ని చేద్దామని దేవితో అన్నప్పుడు ఆయన ‘పట్టుకోవడం’ అనే పదాన్ని సూచించాడు. సినిమాలో ఈ పాట బన్నీపై వుంటుంది. ఎంతో బిజీగా వున్నా ఈ పాట కోసం దేవి పనిచేశాడు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుందని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ పాట బాగా రావడానికి బన్నీ కారణం. ప్రతి చిన్న విషయాన్ని అయన దగ్గరుండి చూసుకున్నాడు. జానీ మాస్టర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఈ పాట చేయించాడు. నిర్మాతలు, త్రివిక్రమ్ లేకపోతే ఈ పాట ఇంత బాగా వచ్చుండేదికాదు’ అన్నారు.
          అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ప్రమోషనల్ వీడియో ఐడియా త్రివికమ్‌దే. సంగీత దర్శకుడు, హీరో కలిసి ప్రమోషనల్ సాంగ్ చేయడం ఇదే తొలిసారన్నారు. సినిమాను ఆగస్టు9న విడుదల చేస్తున్నాం’ అని చిత్ర సమర్పకుడు దానయ్య తెలిపారు.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers