
టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొంది, టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న గోవా బ్యూటి ఇలియానా పాపులారిటీ వచ్చిన తరువాత బాలీవుడ్ కి వెళ్ళి పోయి అక్కడ తన టాలెంట్ ని చూపించి అక్కడ పాగా వేద్దామని చూసింది. కానీ ఈ అమ్మడుకి అక్కడ అంతగా కలిసి రాలేదు. ఈ మధ్యన ఇలియానాకు తెలుగులో హిందీలో కూడా అంతంత మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఈ అమ్మడు తెలుగులో నటించిన స్నేహితుడా, జులాయి, దేవుడు చేసిన మనుష్యులు విడుదల అయ్యాయి. ఇవి కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఇక ఆ విషయం ప్రక్కన బెడితే... ఈ అమ్మడు పేరు చెబితేనే... తెలుగు ఇండస్ట్రీ అగ్గిమీద గుగ్గిలం అవుతుందట. ఈమె అంతలా చేసిన తప్పేంటి అని అనుకుంటున్నారా ? ఈ మధ్యన ఇలియానా తాను నటించిన సినిమాల ప్రమోషన్లకి రాకపోవడమే కారణం అంటున్నారు. ఆమె జులాయి ప్రమోషన్ కి రాకుండా, జులాయి ఆడియోకి సైతం డుమ్మా కొట్టిన ఈ ముద్దుగుమ్మ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండటంతో తెలుగుపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు. ఈ విషయం పై ఆ మధ్యన పెద్దన ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇలియానాని పెట్టుకుంటే సినిమాకి ఏ మాత్రం ఉపయోగం లేదని భావించిన సదరు తెలుగు ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు ఈమెను తీసుకోవడానికి ఇష్ట పడటం లేదట. కొందరు సినీ జనాలు అయితే... ఎవరు చేసుకున్న గోతిలో వారు పడటం అంటే ఇదే అంటున్నారు.
