
టాలీవుడ్ హీరో నాగార్జునకు తన ఇన్ని సంవత్సరాల సినీ జీవితంలో ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పాలి. ఆయన ఏ సినిమాలో నటించినా వెంటనే విడుదల అయి ప్రేక్షకులను అలరించేవి. కానీ ఆయన ఈమధ్య ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నటించిన షోఫియోఫాంటసీ సినిమా ‘ఢమరుకం ’ విడుదలలో మాత్రం జాప్యం జరుగుతూ వస్తుంది. ఇదిగో విడుదల చేస్తున్నాం... అదిగో విడుదల చేస్తున్నాం అని దర్శక నిర్మాతలు ప్రకటనలు చేయడం వరకే సరిపోయింది. కానీ ఇంత వరకు ఆ సినిమాను విడుదల చేయలేదు. నిజానికి గత నెలలో విడుదల చేస్తామని ప్రకటించి.... తీర సమయానికి వచ్చాక విడుదలను వాయిదా వేశారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వీకెండ్ లోగా సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఎక్కువ థియేటర్ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని, తాము అనుకున్నన్ని థియేటర్లు దొరకక పోవడంతో విడుదలపై ఏనిర్ణయానికి రాలేక పోతున్నారని సమాచారం. నవంబర్ 9న గానీ, అప్పటికీ పరిస్థితులు అనుకూలించక పోతే నవంబర్ 15లోపు ఏదో ఒక తేదీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఈసారైనా చెప్పిన టైంకి విడుదల చేస్తారో లేదో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
