
మల్లూ బేబీ అమలాపాల్ అవకాశాల పరంపర కొనసాగుతోంది. తాజాగా తమిళ నాట కూడా ఈ అమ్మడి హవా ఇప్పుడు మొదలైపోయింది. తాజాగా ఆమె సూపర్ స్టార్ విజయ్ సరసన కథానాయికగా ఎంపికైంది. విజయ్ హీరోగా ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించే భారీ చిత్రంలో అమలా కథానాయికగా సెలెక్ట్ అయింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మలయాళంలో నటించిన హిట్ చిత్రం 'రన్ బేబీ రన్' చూసిన మీదట హీరో విజయ్ ఆమెను తన సినిమాకు రికమెండ్ చేశాడట. దర్శకుడికి కూడా ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చడంతో ఆమె ఎంపిక ఓకే అయింది. విశేషమేమిటంటే, మొదట్లో ఈ సినిమాకి సమంతాను ఎంపిక చేయాలనుకున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగు వచ్చే నెల 23 న ప్రారంభమవుతుంది.
...avnk