
బాలయ్యబాబు కొంత గ్యాప్ తర్వాత ఇటీవలకాలంలో చకచకా సినిమాలు చేసాడంటే దానికి దర్శకుడు బోయపాటి అందించిన సింహా మూవీ నే కారణం. ఈ విజయోత్సాహంతో బాలయ్య ముందుకు సాగుతున్నాడు ప్రస్తుతం. సింహా చిత్రమే దర్శకుడు బోయపాటి శ్రీను ను ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ ని చేసేసింది కూడా. 'సింహా' చిత్రం ద్వారా నటుడిగా బాలకృష్ణ విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన బోయపాటి మరో మారు బాలయ్యను తన చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లోనూ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'శ్రీమన్నారాయణ' చిత్రం తర్వాత మళ్లీ ఇంతవరకు ఏ చిత్రాన్నీ అంగీకరించని బాలకృష్ణ, బోయపాటి చెప్పిన కథ విన్న వెంటనే ఓకే చెప్పారనీ, దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయనీ అంటున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే.. 'దమ్ము' సినిమా తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ లకు కథలు వినిపించిన బోయపాటి ఆయా ప్రాజక్ట్ లకు మరింత సాన పెడుతున్నట్టు సమాచారం.
...avnk