
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కాబోతుందనేది తాజా సమాచారం. ఈ మూవీ గురించి నిర్మాత పలు ఆశక్తి కర విషయాలు వెల్లడించారు. అవేంటంటే.. మామూలుగా ఏ హీరో అయినా ఓ సినిమా అంగీకరించే ముందు మొత్తం కథ వింటాడు. తన సందేహాలు తీర్చుకోవడానికి ఒక్కోసారి మరో రెండు మూడు సార్లు కూడా వింటుంటారు. అయితే, కేవలం పదేహేను నిమిషాల పాటు మాత్రమే కథ విని మహేష్ బాబు ఓ సినిమా యాక్సప్ట్ చేశాడు. అదే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అని దిల్ రాజు చెప్పారు. అంతేకాదు.. ''దర్శకుడు శ్రీకాంత్ కథ చెప్పడం మొదలుపెట్టిన పదిహేను నిమిషాలకే మహేష్ ఎంతగానో ఇంప్రెస్ అయిపోయాడు. 'ఈ సినిమా నేను చేస్తున్నాను' అంటూ వెంటనే అంగీకరించారు. అంటే, ఈ సినిమా కథలో వున్న స్టామినా అటువంటిది. అన్ని వర్గాల వారికీ ఇది నచ్చుతుంది' అంటున్నాడు
ఈ చిత్రం చివరి షెడ్యూలు షూటింగు ఈ నెల 27 నుంచి జరుగుతోంది. వచ్చే నెల 15 తో మొత్తం పూర్తవుతుంది. వెంకటేష్, అంజలి ఓ జంటగా... మహేష్ బాబు, సమంతా మరో జంటగా ఇందులో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
..avnk