
కొంపడిపోద్ది.. అదంతా కాదు.... తారకరత్న హీరోగా వెంకట్ పంపన రూపొందిస్తోన్న వైవిధ్యభరిత చిత్రమే 'నేను చాలా వరస్ట్'. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సాగర్ క్లాప్ ఇవ్వగా ... ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేయగా దేవుడి పటాలపై చిత్రీకరణ జరిపారు.
ఈ మూవీకి సంబంధించిన విశేషాలు చిత్ర వర్గం తెలియపరిచింది. ఈ సినిమా కథ రెడీ చేసుకోగానే, దీనికి ఒక్క తారకరత్న మాత్రమే న్యాయం చేయగలడని అనిపించిందనీ, కథ చెప్పగానే ఆయన అంగీకరించడం తమ అదృష్టమని, పి.ఎన్.ఎస్.గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, తొలి షెడ్యూలు ప్రకారం ఈ రోజు నుంచి 12 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ కొనసాగుతుందని దర్శకుడు చెప్పారు. ఆ తరువాత వైజాగ్ తదితర ప్రదేశాల్లో కీలకమైన సన్నివేశాలను ... పాటలను చిత్రీకరిస్తామని అన్నారు. యముడి గెటప్పులో తారకరత్న చాలా బాగా కుదిరారనీ, ఆయన జోడీగా నీరజ కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమాకి తాము పెట్టిన టైటిల్ రొటీన్ కి భిన్నంగా ... ఇంటరెస్టింగ్ గా ఉందంటూ అందరూ ప్రశంసిస్తున్నారనీ చెప్పుకొచ్చారు.
...avnk