
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కాంబినేషన్లో వస్తున్న 'నాయక్' సినిమా తాజా షెడ్యూలు హైదరాబాదులో తిరిగి మొదలైంది. ఈ చిత్రం కొన్ని రోజులు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకున్న తరువాత మరో షెడ్యూల్ కోసం కోల్కతా వెళ్ళింది. అక్కడ షెడ్యూల్ ముగించుకొని ఈరోజు నుండి హైదరాబాద్లో మరో షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. సారధి స్టుడియోస్ లో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్ నిర్మించారు. కోల్కతా షెడ్యూలులో యాక్షన్ దృశ్యాలను భారీ ఎత్తున షూట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను దీపావళి సందర్భంగా వచ్చే నెల 13 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియోను అదే నెల 25 న, విడుదల చేస్తారు. చరణ్ సరసన కాజల్, అమలాపాల్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్న విషయం విదితమే. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. వి వి వినాయక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుచుతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి రేసులో ఉన్న నాయక్ చిత్రం 2013 జనవరి 9న విడుదలకు సిద్దమవుతుంది.
...avnk