'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా విడుదలకు ముందుగానే యూరప్ పర్యటనకు వెళ్ళిన హీరో పవన్ కల్యాణ్, రెండు వారాల విశ్రాంతి అనంతరం ఈ రోజు హైదరాబాదుకు తిరిగివచ్చారు. ఈలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు రెడీ అయింది. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, కథను బట్టి ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ' అనే టైటిల్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చే ఈ చిత్రాన్ని బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తారు. ఈ చిత్రం ద్వారా కథానాయికగా సమంతా తొలిసారిగా పవన్ కల్యాణ్ తో జతకడుతోందని ఇంతకు ముందే సమాచారమిచ్చాం.

ఇదిలా ఉండగా, ముఠా మేస్త్రీ’ తో చిరంజీవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు, ఆయన కెరీర్ లో గొప్ప హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఆ సినిమా! ఇప్పుడు ఆ పంథాను కొనసాగిస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాన్ ‘చోటా మేస్త్రీ’గా కనపడటానికి సిద్ధం అవుతున్నాడు. ‘గుడుంబా శంకర్’ , ‘గబ్బర్ సింగ్’ వంటి మాస్ మసాలా టైటిల్స్ తో పాజిటివ్ రిజల్ట్స్ ను చూసిన పవన్ ‘చోటామేస్త్రీ’ అనే టైటిల్ పై కూడా చాలా ఇష్టంతో ఉన్నాడు. ఈ టైటిల్ ను తెరపై చూపబోయే దర్శకుడు సంపత్ నంది. ఇతడు ఇంతకు ముందు రామ్ చరణ్ తో ‘రచ్చ’ చేశాడు. రెండు వరస హిట్లు కొట్టిన ఆ దర్శకుడిపై పవన్ నమ్మకంతో ఉన్నాడు. దీంతో అతడికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఒకవైపు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్న పవన్ అదే సమయంలో సంపత్ సినిమాను కూడా కొనసాగిస్తాడు. దర్శకుడు సంపత్ నం ది ‘ఏమైందీ ఈవేళ’ అనే సెకెండ్ గ్రేడ్ మూవీతో వెలుగులోకి వచ్చాడు. అయితే అనుకోని అవకాశం ‘రచ్చ’తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘ముఠామేస్త్రీ’తో తాను చిరంజీవి ఫ్యాన్ అను అయ్యాయని, ఇప్పుడు పవన్ తో ‘చోటా మేస్త్రీ’ చేయబోతున్నందుకు చాలా ఆనందంగాఉందని సంపత్ నంది ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. ముఠామేస్త్రీ చిరంజీవిలో మాస్ లుక్ మెస్మరైజింగ్ చూపింది, ‘చోటామేస్త్రీ’ ఏ సంచలనం తెస్తుందో...
...avnk