
మెగా ఫ్యాన్స్ కు దీపావళి టపాసులాంటి వార్త. రామ్ చరణ్, వీవీ వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నాయక్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ సిద్ధమవుతోంది. అభిమానులను ఆకట్టుకునేలా సిద్ధం చేస్తున్న ఈ టీజర్ను దీపావళి రోజున అంటే నవంబర్ 13 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో వేడుకను నవంబర్ 25 న హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి మరోపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులంతా విచ్చేస్తారని అంటున్నారు. ఇటీవలే కోల్ కతా షెడ్యూలును పూర్తి చేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూలు మరికొన్ని రోజుల్లో హైదరాబాదులో మొదలవుతుంది. ఇందులో చరణ్ పక్కన కాజల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
...avnk