19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 3.gif

    Oct 28 ,2012 01:39 pm

    tv_serial_acc

    టీవీ సీరియల్ నటి అర్చన, సీరియల్ టీం కీలక సభ్యులు కటకటాల పాలయ్యారు.  టీవీ సీరియల్ షూటింగ్‌లో కారు ప్రమాదానికి కారణమై ఒక బాలుడి మృతికి కారణమైన నటి, డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్‌లోని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. 'ఇంద్రాణి' అనే టీవీ సీరియల్ షూటింగ్‌లో భాగంగా.. చందానగర్‌లోని ఆర్వీ విద్యాన్ కాలనీలో కారు నడిపే దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగి.. సాత్విక్ రెడ్డి అనే బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి బాధ్యులైన నటి అర్చన అలియాస్ అపర్ణ, డైరెక్టర్ శరత్‌బాబు, మేనేజర్ వెంక టేశ్వర్ రావు, కారు డ్రైవర్ రాజులను చందానగర్ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
          మరోవైపు.. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాత్విక అనే బాలికకు సర్జరీ చేసేందుకు డబ్బు కావాల్సిరావడంతో ఆమె తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాత్విక వైద్యానికి అయ్యే ఖర్చును తాము భరించలేమని ఆమె తండ్రి వాపోతున్నారు. తమకు చిత్రవర్గం ఏమాత్రం సహాయం చేయటంలేదని వారు ఆరోపిస్తున్నారు.

    ar

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers