
అయ్యో... పాపం... కోట్లకు పడగలెత్తిన ప్రముఖ సినీ స్టార్ అక్కినేని నాగార్జునకు ఎందుకంత కష్టం వచ్చిపడింది.. ఎందుకు కడు బీదలకు సర్కారు ఇచ్చే ఉపాది హామీ పథకం కార్డు ఈయనకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని బుర్ర పీక్కుంటున్నారా... నిజమే సినీ హీరో నాగార్జునకు ఉపాధి హామీ స్మార్టు కార్డు జారీ అయింది! సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఉపాధి హామీ స్మార్ట్ కార్డులపై లబ్ధిదారులకు బదులు ప్రముఖుల ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన వేల్పుల ఎల్లయ్య(35) పేరిట స్మార్టు కార్డు జారీ అయింది. అయితే.. ఈ కార్డుపై ఎల్లయ్య బదులుగా నాగార్జున ఫొటో ఉంది. ఇదీ మన సర్కారీ నౌకరీల పనితనం...
...avnk