19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 30.gif

    Oct 26 ,2012 07:09 pm

    Amala-Paul-Latest-Hotee

    తమ పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుందంటూ ... తమ కాలేజ్ పిల్లలా కనిపిస్తుందంటూ కుర్రకారు ప్రేక్షకులు నుంచి అరవిరిసిన అందం అమలాపాల్ కు ఆదిలోనే ఆదరణ లభించింది. చిన్న సినిమాలు ... అంతగా గుర్తింపులేని పాత్రల స్థాయి నుంచి, యువ కథానాయకుల జోడీగా జట్టు కట్టే స్థాయికి ఆమె ఎదిగింది. అందుకు కారణం సహజమైన అందం ... అతి సహజమైన అభినయమని చెప్పొచ్చు. 1991 లో కేరళలోని కొచ్చి లో జన్మించిన అమలాపాల్, అభినయం పట్ల అభిమానంతో సినిమా రంగం వైపు అడుగులు వేసింది. 'నీల తామర' అనే మలయాళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె, ఆ తరువాత 'వీర శేఖరన్' అనే సినిమాతో తమిళ తెరకి పరిచయమైంది. ఈ నేపథ్యంలో తమిళంలో ఆమె నటించిన 'మైనా' చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా, ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. ఫలితంగా ఆమె 'బెజవాడ' సినిమాతో తెలుగు తెరపైన కనిపించింది. ఈ సినిమా కానీ ఆ తరువాత వచ్చిన 'లవ్ ఫెయిల్యూర్' సినిమా కాని ఆమెకు ఆశించిన విజయాలను అందించలేదు. అయితే అందంలోను ... అభినయంలోను తనదైన ప్రత్యేకతే ఆమెకు అవకాశాలు తెచ్చి పెడుతోంది. ప్రస్తుతం అమల చేతిలో 'జెండా పై కపిరాజు' ... 'నాయక్' ... ' ఇద్దరమ్మాయిలతో' సినిమాలు ఉన్నాయి.  ఇలా అనతికాలంలోనే తారా పథాన దూసుకుపోతోన్న అమలాపాల్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది తెలుగువిశేష్.కాం...

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers