
మాస్ మహరాజ రవితేజ చాలాకాలం తర్వాత మళ్లీ ఓ చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. చూస్తుంటే.. ఇప్పుడు టాలీవుడ్ లో గెస్ట్ పాత్రల కాలం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రకరకాల ఆబ్లిగేషన్ల కారణంగా, ఒక్కో స్టార్ ...ఒక్కో సినిమాలో గెస్ట్ పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న 'రోమియో' సినిమాలో రవితేజ ఓ గెస్ట్ రోల్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తుంటే... రవితేజ హీరోగా నటిస్తున్న 'సార్ వచ్చారు' చిత్రంలో నారా రోహిత్ ఓ గెస్ట్ పాత్ర పోషించడానికి అంగీకరించాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు పరశురాం తనకు స్నేహితుడు కావడం వల్ల, రోహిత్ అందులో ఓ స్పెషల్ పాత్రలో కనిపించడానికి ఒప్పుకున్నాడట. ఏమైనా, భేషజాలను పక్కన పెట్టి, మన హీరోలు ఇలా గెస్ట్ రోల్స్ చేయడం ఆహ్వానించదగ్గ, అభినందించదగ్గా పరిణామమే!
'రోమియో' సినిమాకు గోపి గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కథను పూరీ జగన్నాథ్ అందించాడు. ఈ ప్రేమకథా చిత్రంలో రవితేజ పోషించేది చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాముఖ్యత వున్న పాత్ర అని అంటున్నారు. రవితేజ వంటి స్టార్ నటించడం వల్ల ఈ చిత్రానికి ఓ క్రేజ్ వస్తుందనే చెప్పాలి. ఇందులో అడోనికా కథానాయికగా నటిస్తోంది.
..avnk