
పుత్రుడు గౌతంకు ఎలాగైనా తెలుగు తెరమీద మంచి గుర్తింపు లభించేలా చేయాలన్న తలంపుతో సతమతమౌతున్నారు హాస్యనటుడు బ్రహ్మానందం. ఇందులో భాగంగా గతంలో నారా రోహిత్ హీరోగా 'బాణం' చిత్రాన్ని నిర్మించిన చైతన్య దంతులూరి తో తదుపరి చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. గౌతమ్ కథానాయకుడుగా రూపొందే చిత్రానికి చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. 'ఏ లవ్ స్టోరీ బిట్వీన్ ఏ కైట్ అండ్ ఏ ఫ్లైట్' అనే క్యాప్షన్ తో ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమా టైటిల్ కూడా ఖరారైందనీ, గౌతమ్ పెళ్లి రోజైన విజయదశమి రోజున దానిని ప్రకటిస్తారనీ చిత్రం యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అదిగో పైన అగుపిస్తున్నదే ఆమూవీ ఫస్ట్ లుక్...
...avnk