
వర్థమాన నటుడు నారో రోహిత్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ఒక్కడినే. నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణం రాజు, బాలకృష్ణ, కార్తీక్ తదితరలు హాజరయ్యారు. ముఖ్య అతిధి బాలకృష్ణ సీడీలను విడుదల చేయగా కృష్ణంరాజు తొలి సీడిని స్వీకరించారు.