
ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల్లో కొత్త పంథా చోటుచేసుకుంటుంది. ఇంతకు ముందు అడపాతడపా కనబడే ఈ పద్ధతి ఇప్పుడు జోరందుకుంది. గతంలో చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు తమ సినిమాల్లో ప్రత్యేకమైన పాటలు పాడారు. కేవలం గాయకులే ప్రధానంగా ఆలపించే పాటలు ఇప్పుడు ఎంతోమంది కథానాయకులు, కథానాయికలు ఆఖరికి కమెడియన్లు కూడా తమ గొంతుతో ఓ పాటేసుకున్న సందర్భాలు బోలెడు కనిపిస్తున్నాయి. బ్రహ్మానందం, సిద్ధార్థ్.. ఇలా ఈ జాబితా పెద్దదే. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరో పేరు కూడా చేర్చుకోండి. అది మరెవరో కాదు... శ్రీకాంత్..... . లక్కీ సినిమాకోసం శ్రీకాంత్ ఓ పాటపాడారు. నటించడం కంటే పాట పాడటం చాలా కష్టమని కూడా ఇప్పుడు శ్రీకాంత్ కు తెలిసొచ్చిందట
...avnk