
మంచు మనోజ్ మాస్ ప్రేక్షకుల పల్స్ అందుకునేందుకు అర్రులు చాస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా కొత్త సినిమా చేయబోతున్నాడు. ఆమధ్య నిఖిల్ హీరోగా 'వీడు తేడా' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు చిన్నికృష్ణ, తన తదుపరి చిత్రం కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో మంచు మనోజ్ కథానాయకుడుగా నటిస్తాడు. చిన్నికృష్ణ చెప్పిన కథను మనోజ్ బాగా ఇష్టపడ్డాడనీ, వెంటనే చేయడానికి తన అంగీకారాన్ని తెలిపాడనీ అంటున్నారు.
బెల్లంకొండ సురేష్ తమ శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ కి వెళుతుంది. 'వీడు తేడా' సినిమాలాగానే, ఇది కూడా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది.
...avnk